గాయత్రీవిద్య
గాయత్రీ గయాన్ ప్రాణాన్ త్రాయత ఇతి గాయత్రీ ప్రాణములను రక్షించునది గాయత్రి అని ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. గయలు అంటే ప్రాణాలు అని అర్ధం. త ద్యత్ప్రాణా వ్రాయతే తద్గాయత్రీ ప్రాణరక్షణ చేయునది గాయత్రి అని బృహదారణ్యకోపనిషత్తు వివరించింది. తస్మాద్దాయంతం త్రాయతే యతః గానము చేయువానిని రక్షించునది. గీయతే తత్త్వమనయా గాయత్రీతి అని శంకర భాష్యం. ఈ మంత్రంలో దైవత్వం గానం చెయ్యబడింది. అందుచేత గాయత్రి అనబడుతుంది. గాయత్రి మంత్రం రెండు రకాలుగా ఉన్నది. 1. బ్రాహ్మణులకు ఉపనయనకాలంలో ఉపదేశించేది. 2. వేదాలలో నిగూఢమైనది. ఇదే పంచదశి మహామంత్రము. అందుచేతనే గాయత్రి మంత్రం బ్రాహ్మణులకోసం ఏర్పడగా పంచదశి మహామంత్రం అన్ని వర్ణాలవారికోసం ఏర్పడింది అన్నాడు అగస్త్యమహర్షి ఇంకా చెప్పాలి అంటే గాయత్రీ మంత్రము, పంచదశి మహామంత్రము రెండూ ఒక్కటే. ఈ రెండింటి అర్ధం కూడా ఒక్కటే. శరీరాదులను రక్షించటంచేత గాయత్రి అని, తేజస్వరూపమవటంచేత సావిత్రి అని, వాగ్రూపం కావటంచేత సరస్వతి అని చెప్పబడుతోంది. సవితృద్యోతనా స్సైవ సావిత్రీ పరికీర్తితా ప్రపంచాన్ని సృజించి ప్రకాశింపచేస్తుంది. కా...