Posts

Showing posts from December, 2022

గాయత్రీవిద్య

Image
గాయత్రీ గయాన్ ప్రాణాన్ త్రాయత ఇతి గాయత్రీ ప్రాణములను రక్షించునది గాయత్రి అని ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. గయలు అంటే ప్రాణాలు అని అర్ధం. త ద్యత్ప్రాణా వ్రాయతే తద్గాయత్రీ  ప్రాణరక్షణ చేయునది గాయత్రి అని బృహదారణ్యకోపనిషత్తు వివరించింది.  తస్మాద్దాయంతం త్రాయతే యతః  గానము చేయువానిని రక్షించునది.  గీయతే తత్త్వమనయా గాయత్రీతి  అని శంకర భాష్యం. ఈ మంత్రంలో దైవత్వం గానం చెయ్యబడింది. అందుచేత గాయత్రి అనబడుతుంది. గాయత్రి మంత్రం రెండు రకాలుగా ఉన్నది. 1. బ్రాహ్మణులకు ఉపనయనకాలంలో ఉపదేశించేది. 2. వేదాలలో నిగూఢమైనది. ఇదే పంచదశి మహామంత్రము. అందుచేతనే గాయత్రి మంత్రం బ్రాహ్మణులకోసం ఏర్పడగా పంచదశి మహామంత్రం అన్ని వర్ణాలవారికోసం ఏర్పడింది అన్నాడు అగస్త్యమహర్షి ఇంకా చెప్పాలి అంటే గాయత్రీ మంత్రము, పంచదశి మహామంత్రము రెండూ ఒక్కటే. ఈ రెండింటి అర్ధం కూడా ఒక్కటే. శరీరాదులను రక్షించటంచేత  గాయత్రి  అని, తేజస్వరూపమవటంచేత  సావిత్రి  అని, వాగ్రూపం కావటంచేత  సరస్వతి  అని చెప్పబడుతోంది. సవితృద్యోతనా స్సైవ సావిత్రీ పరికీర్తితా ప్రపంచాన్ని సృజించి ప్రకాశింపచేస్తుంది. కా...

జ్ఞాన సిద్ధాంతం

Image
* స్మ్రుతి * మానవులు ఏదైనా విషయాన్ని పదే పదే స్మరిస్తే వారికి అది చిరకాలం గుర్తుండిపోతుంది. ఉదాహరణకి చిన్నప్పుడు పిల్లలు అందరూ ఎక్కాలు భట్టీ పడతారు. కళ్ళు మూసుకుని 2 X 1 = 2 దగ్గర మొదలుపెట్టి 10 X 10 = 100 దాకా భట్టీ పట్టేస్తారు. కొంతమంది పిల్లలు అయితే 20 X 20 = 400 వరకూ భట్టీ పట్టేస్తారు. అవి వారికి జీవితాంతం గుర్తుండిపోతాయి. పూర్వ కాలంలో పిల్లలతో అమరకోశం ఇలాగే భట్టీ పట్టించేవారు. తద్వారా సంస్కృత వాఙ్మయంలో వచ్చే పదాలన్నీ వారికి చిరకాలం గుర్తుండిపోయేవి. బ్రహ్మచర్యంలో ఉన్నత విద్యలు అభ్యసించే సమయంలో అవసరమయ్యే జ్ఞాన పునాదులు బాల్యంలోనే సముపార్జించిపెట్టే ప్రక్రియ - ఈ భట్టీ పట్టడం.  ఏదైనా విషయం గుర్తుండాలంటే అది పురాణంలో నిల్వ చేసి ఉండాలి. అవసరమైనప్పుడు అది అక్కడినుండి బయటకు రావాలి. విషయాలని స్మరిస్తున్నపుడు అవి స్మృతిని చేరుతాయి. అప్పుడు స్మృతి ఫలానా సమయంలో, ఫలానా ప్రదేశంలో ఈ విషయం స్మరించబడింది అని దాని విషయ సూచికలో భద్రపరచుకుంటుంది. వెంటనే వాటిని పురాణానికి పంపించి అక్కడ నిల్వ చేస్తుంది. అవి చెవిద్వారా వచ్చిన ధ్వని తరంగాలు అవ్వచ్చు, ముక్కు ద్వారా వచ్చే వాసనలు కావచ్చు, కంటి ద్వారా వచ...